Friday, 3 June 2022

వికాసము, పెరుగుదల మరియు పరిపక్వత

వికాసము, పెరుగుదల మరియు పరిపక్వత

 1. వికాసము, పెరుగుదల మరియు పరిపక్వత

పెరుగుదల - వికాసం పరిపక్వత -

పెరుగుదల

  • మానవ శరీరంలో జరిగే పరిమాణాత్మక మార్పులు (Quantitative Changes) ను పెరుగుదల అంటారు.
  • ఉదా : ఒక వ్యక్తి పొడవయ్యాడని, లావయ్యాడని, ముసలివాడయ్యాడని చెప్పటం.
  • ఒక వ్యక్తిలో సంభవించే ఇలాంటి భౌతిక/ శారీరక మార్పులే పెరుగుదల.
  • పెరుగుదల బహిర్గతంగా మరియు అంతర్గతంగాను జరుగుతుంది. బాహ్యంగా కనిపించే శారీరక పరమయిన ఎత్తు, బరువు, ఇతర అవయవాల పెరుగుదలను బహిర్గత పెరుగుదల అంటారు. అలాగే అంతర వ్యవస్థలోని మెదడు, గుండె, కాలేయము ...... లాంటి అవయవములో పెరుగుదలను అంతర్గత పెరుగుదల అంటాము.
  • వ్యక్తిలో అంతర్గతంగా, బహిర్గతంగా కనిపించే అవయవాల అభివృద్ధిని పెరుగుదలగా చెప్పుకోవచ్చు.

వికాసము

  • ఒక వ్యక్తిలో సంభవించే గుణాత్మక మార్పులు (Quantitative Changes) ను వికాసము అంటారు. (సంభవీయత విచ్చుకొనుట) 
  • నోట్: గుణాత్మక మార్పులు అనగా భౌతికంగా కనిపించే శారీరక మార్పులే గాక వ్యక్తి యొక్క మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలలో కనిపించే మార్పులు/అభివృద్ధి.
  • ఉదా : ప్రజలలో, ఆలోచనలో, నడవడికలో, ఉద్వేగ ప్రదర్శనలో, నీతి నియమాలను అనుసరించుటలో, సాంఘికీకరణలో, మనిషి జీవికాలంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి.
  • ఆకారాలను, ప్రాకార్యాలను సమైక్య పరిచి విశదపరచే క్లిష్ట ప్రక్రియే వికాసము - గెసెల్.
  • పెరుగుదలకు, వికాసమునకు మధ్య బేధములు :

Saturday, 2 April 2022

సహజ పరిశీలన (Naturalistic Observation)

సహజ పరిశీలన (Naturalistic Observation)

సహజ పరిశీలన (Naturalistic Observation)

పరిశీలన అంటే మామూలుగా చూడడం కాక, ఒక వ్యక్తి ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశాలను సన్నద్ధతతో, స్పష్టంగా, నిశితంగా చూడడం అని నిర్వచించవచ్చు. పరిశీలనాంశం ఒక వ్యక్తి ప్రవర్తన కావచ్చు, కొంత మంది వ్యక్తుల ప్రవర్తన కావచ్చు. వ్యక్తుల పరిసరాలతో స్పందించే తీరు కావచ్చు లేదా ఏదైనా దృగ్విషయం కావచ్చు. పరిశీలనాంశాలను సహజ పరిస్థితులలో జరుగుతున్నప్పుడు పరిశీలించడాన్నే సహజ పరిశీలన అంటారు. ఉదాహరణకు వివిధ సామాజిక వర్గాలకు చెందిన పిల్లలు వారి బాల్యాన్ని ఎలా అనుభవిస్తున్నారో తెలుసుకొనుటకు వారు నివసిస్తున్న ఇండ్ల వద్దకు వెళ్ళి వారు ఏమి చేయుచున్నారో ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకోవడం.

ఈ పద్ధతిలో సహజ పరిస్థితులలో ప్రవర్తనాంశాలను పరిశీలించటం జరుగుతుంది. కాబట్టి పిల్లల ప్రవర్తన పట్ల ఒక ఖచ్చితమైన అవగాహనకు రావచ్చును. పరిశీలించబడే వ్యక్తులకు వారు ఇతరులచే పరిశీలించబడుతున్నామనే విషయం తెలిస్తే వారి ప్రవర్తనలో మార్పు వచ్చే అవకాశం ఉన్నది. కావున పరిశీలించబడుతున్నామనే విషయం తెలియకుండా జాగ్రత్త వహించాలి. సహజ పరిశీలనలో పరిశీలించే అంశాలను నమోదు చేయడం కొంత కష్టంతో కూడిన పని ఎందుకంటే పరిశీలించే దత్తాంశాన్ని నమోదు చేస్తే అది పరిశీలించబడే వ్యక్తులకు తెలిసే అవకాశం ఉన్నది. అంతే కాకుండా పరిశీలిస్తూ నమోదు చేస్తే, నమోదు చేసే సమయంలోని ప్రవర్తనాంశాలను సరిగ్గా పరిశీలించలేరు. ఈ పద్ధతిలోని ఈ పరిమితిని అధిగమించుటకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అటు పరిశీలింపబడే వ్యక్తులకు తెలియకుండాను, అదే విధంగా ప్రవర్తనాంశాల లోని అన్ని విషయాలను నమోదు చేయవచ్చును. ఈ పద్ధతిలోని మరో పరిమితి ఏమంటే వ్యక్తుల బాహ్యప్రవర్తనకు మాత్రమే పరిశీలించగలుగుతాం, కాని వారి అంతర్గత మానసిక ప్రక్రియలను పరిశీలించలేం. అయితే మానసిక ప్రక్రియలను ప్రత్యక్షంగా పరిశీలించలేకపోయినప్పటికి, సహజపరిస్థితులలో వారి ప్రవర్తనను పరిశీలిస్తాం కాబట్టి వారి మానసిక ప్రక్రియల గురించి కూడ ఒక అంచనాకు రావచ్చు.

ఉపయోగాలు

1. ఇది చాలా సులభమైన పద్ధతి. పరిశీలించడం అనేది మానవునికి సహజంగానే వచ్చిన గుణం కావున కొద్దిపాటి శిక్షణ సరిపోతుంది.

2. ప్రవర్తనాంశాలను సహజపరిస్థితులలో పరిశీలిస్తాం, కాబట్టి ప్రవర్తనాంశాల పట్ల ఖచ్చితమైన అవగాహన వస్తుంది.

3. తమ భావాలను వ్యక్త పరచలేనటువంటి పిల్లల, మానసిక రోగుల, జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఈ పద్ధతి ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుంది. 4. దత్తాంశాన్ని సులభంగా సేకరించవచ్చు.

5. వివిధ నేపథ్యాలు కలిగిన పిల్లల బాల్యానికి సంబంధించిన స్థితిగతులను ఈ పద్ధతిని ఉపయోగించి సులభంగా తెలుసుకోవచ్చు.

6. నేడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున పరిశీలనాంశాలను సులభంగానే నమోదు చేయవచ్చు.


పరిమితులు

1. పరిశీలించబడే వ్యక్తులకు పరిశీలించబడుతున్నామని తెలిస్తే వారి ప్రవర్తనలో మార్పు వచ్చే అవకాశముంది.

2 సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించక పోతే పరిశీలనాంశాలను అప్పటికప్పుడు నమోదు చేయడం కష్టం నమోదు చేయని యెడల తదుపరి ఆ ప్రవర్తనను నమోదు చేయాలంటే జ్ఞప్తికి రాకపోవచ్చు.

Sunday, 27 March 2022

మంత్రణం - Counselling

మంత్రణం - Counselling

రూత్ స్ట్రాంగ్ : ముఖాముఖి సంబంధాల ద్వారా మంత్రసద్ధిలో తీసుకొచ్చే మానసిక అభివృద్ధియే మంత్రణం,

గిల్బర్టన్: ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న గతిశీలక సంబంధమే మంత్రణం.

మంత్రణం మార్గదర్శకత్వంలో భాగం. అంతే కాదు. మంత్రణం అనేది ఒక వృత్తి. Counselling లో నిపుణులై Psychologists, సైకియాట్రిస్టు మాత్రమే

ప్రవర్తన సమస్యలు, ఉద్యోగ సమస్యలు పరిష్కరిస్తారు మంత్రణ మనోవిజ్ఞాన శాస్త్రము సర్దుబాటు సమస్యలలాంటి తక్కువస్థాయిలోగల సమస్యలను నిర్ధారించిన చికిత్స అందిస్తుంది. మంత్రణం సవ్యంకాని ప్రవర్తన సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే అవసరము. కాని మంత్రణంలో వ్యక్తి వికాసం అనువంశికత, పరిసరాలు ఆ వ్యక్తిని ఎలా ప్రభావితం చేసాయో అంచనావేసి సమస పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది.

మణం సాధారణంగా వ్యక్తిగత సమస్యలకు కుటుంబ సమస్యలకు సాంఘిక సమస్యలకు విద్యా సమస్యలకు పరిష్కారం చూపుతుంది.


మంత్రణం రకాలు(Types of Counselling):


1)నిర్దేశక - మంత్రణం: (Directive Counselling):

  • దీనిని ఇజి. విలియమ్సన్, డార్లే. ప్రతిపాదించారు. నిర్దేశక మంత్రణానికి మరొక పేరు సమస్య కేంద్రీకృత మంత్రణం. (Problem Centered Counselling)
  • ఈ రకమైన మంత్రణంలో (Counselling) మంత్రకుడికి (Counseller) ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మంత్రికుడు తన అభిప్రాయాలను ఆలోచనలను, సలహాలను, స్వేచ్ఛగా బహిర్గతం చేస్తాడు.
  • మంత్రికుడు క్రియాశీలకుడుగా ఉంటాడు, సహమూర్తి స్థబుడుగా ఉంటాడు (Client) సమస్యకు గల కారణాలు, సమస్య పరిష్కార మార్గాలు,
  • మంత్రికుడే సూచిస్తాడు. తనంతటతాను సమస్యను పరిష్కరించుకోలేనపుడు ఈ రకమైన మంత్రణం వ్యక్తికి ఉపయోగపడుతుంది.


1), అనిర్దేశక మంత్రణం: (Non-Directive Counselling):


అనిర్దేశక మంత్రణంను ప్రతిపాదించినది కార్ల్ రోజర్స్, దీనికి మరొక పేరు "సహాయార్ధి కేంద్రీకృతమంత్రణం" (Client Centered Counselling)


సహాయార్థి సమస్య పరిష్కారంలో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా బహిర్గతం చేస్తాడు. ఈ రకమైన మంత్రణంలో సహాయార్థి చురుకుగా, మంత్రకుడు


సహాయార్థి ఏమి మాట్లాడుతున్నాడో మంతకుడు ప్రశ్నించాడు. సమస్యకు గల కారణాలు, సమస్య పరిష్కార మార్గాలు, సహాయార్థి తనంతట తానే తానే


తెలుసుకుంటాడు. సహాయార్థి తన సమస్యను పరిష్కరించు కోనప్పుడు ఈ రకమైన మంత్రణం ఉప యోగపడుతుంది. చార్శనిక లేదా మిశ్రమ మంత్రణం దార్శనిక లేదా మిశ్రమ మంత్రణం ఎఫ్.సి. థార్న్ ప్రతిపాదించారు. దీనికి మరొక పేరు మిశ్రమ మంత్రణం.


ఈ సమస్యను బట్టి సహాయారి మూర్తిమత్వాన్ని బట్టి అనేక విధానాలను మంత్రకుడు ఉపయోగిస్తాడు. దార్శనిక మంత్రణంలో మంత్రకుడికి మంత్రణంలోని అనేక విధానాలు తెలిసి ఉండాలి.


మంత్రణంలో ముఖ్యంగా పేర్కొన వలసిన విషయాలు


1.26 (Suggestion)


2. (Advices).


3.సమ్మతింపచేయడం (Persuation)


4. వ్యాఖ్యానించడం (Interpretation)

Wednesday, 23 March 2022

ప్లేటో - Plato

ప్లేటో - Plato

 ప్లేటో (428-348 B.C)

  • సోక్రటీస్ శిష్యులలో పెరోన్దినవాడు ప్లేటో.
  • యితడు భావవాది.
  • ‘మనసు మెదడు లోను ,ఇచ్చ హృదయం లోను,తృష్ణ లేదా వాంఛ ఉదారంలోనూ ఉంటాయని అభిప్రాయపడినవాడు.
  • ప్రాచీన పాఠశాల ఉద్యమ ప్రారంభకుడు.
  • విద్య అనేది వ్యక్తిలో మంచిని బయటకు తేవడానికి చేసే ప్రయత్నమని ఇతని అభిప్రాయం.
  • రిపబ్లిక్ గ్రంధ రచయిత.
  • జిమ్నాషియా అనే పాటశాల ప్రారంభకుడు.

సోక్రటీస్ - Socrates

సోక్రటీస్ - Socrates

 సోక్రటీస్ - Socrates :(469-339 B.C)

  • మొదటగా అచేతనమైన మానసిక కృత్యాలను గురించి వివరించడానికి ప్రయత్నించిన వారిలో సోక్రటీస్ చెప్పుకోదగినవాడు.
  • ఇతని తాత్విక అభ్యుపగమానాలు గ్రీక్ తత్వాన్ని,తద్వారా పాశ్చాత్య తత్వాన్ని ఎంతో ప్రభావితం చేసాయి.
  • “ఆత్మ” లో “జ్ఞానం” ఇమిడి ఉందని,జ్ఞానం అంతర్గతంగా,నిగూడం  గా ఉంటుందని,దానిని చైతన్య మానసిక స్థితి లోకి తీసుకు రావచ్చునని తెలియజేసాడు.

Monday, 21 March 2022

మనోవిజ్ఞాన శాస్త్రం | Psychology

మనోవిజ్ఞాన శాస్త్రం | Psychology

మనోవిజ్ఞాన శాస్త్రం

మనం ప్రతిరోజూ అనేకమంది వ్యక్తులను చూస్తుంటాం.అలాగే వాళ్ళ ప్రవర్తనలో అనేక రకాల తేడాలను కూడా గమనిస్తుంటాం.అంతేకాక ఒకే వ్యక్తి విభిన్న పరిస్తితులలో వివిధ రకాలుగా ప్రవర్తిస్తుంటాడు.అయితే నిశితంగా లేదా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ వైవిధ్యంలో కూడా ఒక క్రమం ఉందని మనకు తెలుస్తుంది.ఇటువంటి పరిశీలనలను,పరిశోధనలను ఆధారం చేసుకొని ప్రవర్తనల పట్ల కొన్ని ప్రాగుక్తులను చేయవచ్చుననే భావం మనకు స్పురిస్తుంది.ఇటువంటి ప్రయత్నాలకు ఉద్దేశించినదే మనోవిజ్ఞాన శాస్త్రం.మరో విధంగా చెప్పాలంటే మానవుని ప్రవర్తనలలో ఉన్న కారకాలను తెలుసుకోవడంలో మనోవిజ్ఞాన శాస్త్రం ఆసక్తిని కనబరుస్తుంది.అంటే వ్యక్తి ఒక రీతిలో ప్రవర్తిస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రం ప్రయత్నిస్తుంది.


మనోవిజ్ఞాన శాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రం గా రూపొంది సుమారు 126 సంవత్సరాలయింది.

1879 లో జర్మనీ లోని లీప్ జిగ్ నగరంలో విల్ హెల్మ్ ఊంట్ అనే శాస్త్రజ్ఞుడు మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించడంతో మనోవిజ్ఞాన శాస్త్రం సంప్రదాయ బద్దమైన,స్వతంత్ర మైన ఒక వైజ్ఞానిక శాస్త్రం గా ప్రారంభ మైనదని చెప్పవచ్చు.

19 వ శతాబ్దం మధ్య వరకు మనోవిజ్ఞాన శాస్త్రం తత్వశాస్త్రం లో ఒక భాగంగా ఉండేది.

ప్రస్తుతం మనోవిజ్ఞాన శాస్త్రం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది.ప్రపంచమంతటా ఈ శాస్త్ర అధ్యయనం చురుగ్గా జరుగుతుంది.ఈ శాస్త్ర అధ్యయనం లో అనేక సాంప్రదాయాలు వెలిశాయి.ఈ శాస్త్రం మిగతా శాస్త్రాలను కూడా ప్రభావితం చేయడం మొదలుపెట్టింది.

మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావం - Nature of Psychology

మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావం - Nature of Psychology

మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావం- పద్దతులు

పరిచయం

విజ్ఞానాన్ని ఒక శాస్త్రీయ పద్దతిలో నేర్పడానికి ఉపయోగపడే వ్యవస్థే పాఠశాల. పాఠశాల అనేది ఒక సంస్థ మాత్రమే  కాదు,  అది ఒక వ్యవస్థ కూడా .. మానవుడు సంఘ జీవిగా ఉండడానికీ చారిత్రకంగా మానవుడు ఏర్పరచుకున్న సాంఘీక ,రాజకీయ ,ఆర్ధిక వ్యవస్థలు పునరావృతం కావడానికి విద్య అవసరం.


నిర్వహనా సౌలభ్యం కోసం రూపొందించిన విభాగమే తరగతి గది .అయితే పాటశాల వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినప్పటికి కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి అవుతుంది. తరగతి గదికి కేంద్రబిందువు విద్యార్ది . పాఠశాల వ్యవస్థ రూపొందింది విద్యార్దికోసం.తరగతి గది విదానంలో ఉపాద్యాయుడు మార్గదర్సకుడు,తాత్వికుడు,స్నేహితుడులాగా ప్రవర్తింపవలసి ఉంటుంది.పాటశాల విద్యా విధానాన్ని నిర్వహించి,కొనసాగించే ఉపాధ్యాయునికి విషయజ్ఞానం ఉంటే సరిపోతుంది అని అంటారు చాలామంది .కాని విషయ పరిజ్ఞానానికి తోడు ఉపాద్యాయుడు పిల్లల మనస్తత్వాని తెలుసుకొని దానికి తగిన విధంగా భోదించ గలగాలి .అప్పుడే అది ఫలవంతమవుతుంది.


ఉపాధ్యాయ వృత్తిలో ప్రధాన కర్తవ్యం అభ్యసనం.అందుకే మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయనం ఉపాధ్యాయునికి ఉపయోగపడుతుంది.అభ్యాసన సిద్దాంతాలు,సూత్రాలు విద్యా విషయాలకు అన్వయించడం ద్వారా ఉపాధ్యాయుడు పాఠశాల లోని సన్నివేశాలను సమర్థవంతంగా నిర్వహిం చగలుగుతాడు. మనోవిజ్ఞాన శాస్త్రం అతని వృత్తికి ఒక స్థానం కల్పిస్తుంది.బోధనలో అతనికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించు కోవడానికి ఒక మార్గాన్ని సూచిస్తుంది.బోధనా నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతుంది.అతని పనిని సులభతరం చేస్తుంది.


వడ్రంగి కి కర్ర స్వభావం తెలియాలి.కుమ్మరికి మట్టి స్వభావం తెలియాలి.నేతపనివానికి నూలు స్వభావం తెలియాలి.అలాగే ఉపాధ్యాయుడు మానవుని ప్రవర్తనా స్వభావం గురించి తెలుసుకోవలసి ఉంటుంది. ఈ మానవ ప్రవర్తనా స్వభావాన్ని గురించిన శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం.