1. వికాసము, పెరుగుదల మరియు పరిపక్వత
పెరుగుదల - వికాసం పరిపక్వత -
పెరుగుదల
- మానవ శరీరంలో జరిగే పరిమాణాత్మక మార్పులు (Quantitative Changes) ను పెరుగుదల అంటారు.
- ఉదా : ఒక వ్యక్తి పొడవయ్యాడని, లావయ్యాడని, ముసలివాడయ్యాడని చెప్పటం.
- ఒక వ్యక్తిలో సంభవించే ఇలాంటి భౌతిక/ శారీరక మార్పులే పెరుగుదల.
- పెరుగుదల బహిర్గతంగా మరియు అంతర్గతంగాను జరుగుతుంది. బాహ్యంగా కనిపించే శారీరక పరమయిన ఎత్తు, బరువు, ఇతర అవయవాల పెరుగుదలను బహిర్గత పెరుగుదల అంటారు. అలాగే అంతర వ్యవస్థలోని మెదడు, గుండె, కాలేయము ...... లాంటి అవయవములో పెరుగుదలను అంతర్గత పెరుగుదల అంటాము.
- వ్యక్తిలో అంతర్గతంగా, బహిర్గతంగా కనిపించే అవయవాల అభివృద్ధిని పెరుగుదలగా చెప్పుకోవచ్చు.
వికాసము
- ఒక వ్యక్తిలో సంభవించే గుణాత్మక మార్పులు (Quantitative Changes) ను వికాసము అంటారు. (సంభవీయత విచ్చుకొనుట)
- నోట్: గుణాత్మక మార్పులు అనగా భౌతికంగా కనిపించే శారీరక మార్పులే గాక వ్యక్తి యొక్క మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలలో కనిపించే మార్పులు/అభివృద్ధి.
- ఉదా : ప్రజలలో, ఆలోచనలో, నడవడికలో, ఉద్వేగ ప్రదర్శనలో, నీతి నియమాలను అనుసరించుటలో, సాంఘికీకరణలో, మనిషి జీవికాలంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి.
- ఆకారాలను, ప్రాకార్యాలను సమైక్య పరిచి విశదపరచే క్లిష్ట ప్రక్రియే వికాసము - గెసెల్.
- పెరుగుదలకు, వికాసమునకు మధ్య బేధములు :
Tags:
Growth and Development